హైదరాబాద్‌లో ‘బిర్లా ఓపస్’ ఎక్స్‌పో | Birla Opus interactive expo reaches Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘బిర్లా ఓపస్’ ఎక్స్‌పో

Published Sun, Jun 23 2024 1:03 PM | Last Updated on Sun, Jun 23 2024 1:08 PM

Birla Opus interactive expo reaches Hyderabad

హైదరాబాద్: పెయింట్స్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ విస్తరించే ప్రయత్నం చేస్తోంది.

దేశవ్యాప్తంగా కీలక మార్కెట్‌లలో విజయవంతమైన ఎక్స్‌పోలను అనుసరించి, బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180 పైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బిర్లా ఓపస్ ఎక్స్‌పో జూన్‌ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది.

వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్‌లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో బిర్లా ఓపస్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement