Ex Journalist Empowers Beggars By Upskilling And Helping Them Earn, Details Inside - Sakshi
Sakshi News home page

బిచ్చగాళ్లను  పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం

Published Tue, Apr 25 2023 2:28 PM | Last Updated on Tue, Apr 25 2023 5:32 PM

Beggers corporaion Ex Journalist Empowers Beggars By Upskilling details inside - Sakshi

ఏ సిగ్నల్‌ దగ్గరో, లేదా దారిమధ్యలోనో  దీనంగా కనిపించిన బిచ్చగాళ్లకు తోచినంత సాయం చేయడం చాలామందికి అలవాటు.  అలా  చేయడం వల్ల  కాస్త పుణ్యం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు చంద్ర మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు.  ‘‘దానం చేయవద్దు పెట్టుబడి పెట్టండి’’అనే నినాదంతో అద్భుతాలు సృష్టించారు.  ఈ  పిలుపు వెనుక ఉన్న సాహసం, ఆయన సాధించిన విజయం గురించి తెలిస్తే.. మీరు  కూడా ఔరా అంటారు..!

బెగ్గర్స్‌ కార్పొరేషన్‌: చంద్ర మిశ్రా
జర్నలిస్టు,సామాజిక కార్యకర్త, చంద్ర మిశ్రా  బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పెట్టుబడి పెడితే,  వారికి గౌరవప్రదమైన  జీవితం ఇవ్వొచ్చని బాగా నమ్మారు. బిచ్చగాళ్లకు భిక్ష కాదు పెట్టాల్సింది.. కాసింత చేయూత, తగినంత పెట్టుబడి ఉంటే అద్భుతాలు చేయొచ్చని  నిరూపించారు. ముఖ్యంగా  కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో  అసంఘటిత రంగానికి చెందిన వేలాదిమంది  తమ ఉద్యోగాలను కోల్పోవడం,  వారణాసిలో గుడి దగ్గర వేలాంది మంది బెగ్గర్స్‌ను చూసిన చలించిపోయిన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పేదరికంతో బిచ్చగాళ్లుగా మారిన వారికి దానం పరిష్కారం కాదనీ, ప్రాథమిక మార్పు తీసుకొచ్చేలా సాయం చేయడమే ఏకైక పరిష్కారమని నమ్మారు.  అలా అనేక ప్రయోగాల తర్వాత, చంద్ర అధికారికంగా ఆగస్టు 2021లో బెగ్గర్స్‌  కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేసారు. రూ.10 నుంచి రూ.10వేలు దాకా   తోచినంత పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తామని, దీని ద్వారా గ యాచకుల జీవితాల్లో మార్పువస్తుందని ప్రకటించారు.

బిచ్చగాళ్లకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే చంద్ర లక్ష్యం. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన నిరుద్యోగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్‌బుక్‌  సర్వే నిర్వహించి వారణాసిలో దీన్ని  ప్రారంభించాలని నిర్ణయించారు.  ముందుగా సమీప ప్రాంతాల నుండి దాదాపు 27వేల మంది చేరడంతో ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఉత్సాహం చూపించిన వారికి బ్యాగుల తయారీవంటి నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించడం మొదలైంది. దీంతో పలువురు బిచ్చగాళ్ళు కార్పొరేషన్‌లో చేరిక పెరిగింది. శిక్షణ తరువాత రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అలా ఇంతింతై..అన్నట్టుగా సాగుతోంది బెగ్గర్స్‌ కార్పొరేషన్‌. 2021-22లో  రూ. 5.7 లక్షలతో మొదలైన పెట్టుబడి, 2022-23లో 10 రెట్లు పెరిగింది. ఇపుడు రూ. 10 కోట్ల పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయంపై పలువురి ప్రశంసలు  దక్కాయి.  (బేబీ షవర్‌: ఉపాసన పింక్‌ డ్రెస్‌ బ్రాండ్‌, ధర ఎంతో తెలుసా? )

వ్యవస్థాపకులుగా 14  కుటుంబాలు  
ఫలితంగా ఇప్పటికే 14 పేద కుటుంబాల జీవనోపాధి కల్పించారు. తద్వారా ప్రారంభ పెట్టుబడిదారుల డబ్బును ఆరు నెలల్లోపు తిరిగి  ఇచ్చేయడమేకాదు, 16.5 శాతం లాభాన్ని ఆర్జించారు. దీంతో తన భాగస్వాములైన బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర థాపాతో కలిసి, మిశ్రా ఆగస్ట్ 2022లో బెగ్గర్స్ కార్పొరేషన్‌ ప్రాఫిటబుల్‌ కంపెనీగా మారి పోయింది. 14 యాచక కుటుంబాలు వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నాయి. ఇందులో పన్నెండు కుటుంబాలు చక్కటి సంచులను తయారు చేస్తాయి. మరో రెండు కుటుంబాలు వారు దేవాలయాల సమీపంలో దుకాణాల్లో  పువ్వులు, పూజా సామగ్రి ఇతర  వస్తువులను విక్రయిస్తారు.

కార్పొరేషన్‌లో చేరింది ఒక మహిళ కావడం విశేషం. భర్త వేరొకరిని పెళ్లిచేసుకుని  బాధిత మహిళను ఇంటినుంచి తరిమిమేయడంతో  12 ఏళ్ల కొడుకుతో పాటు,  కాశీ ఘాట్ వద్ద భిక్షాటన చేసేది.  ఆమెను కలిసి పనినేర్చుకోమన్నపుడు వెనకడుగు వేసింది. మిషన్‌ను పాడు  చేస్తానేమోనని భయపడింది. చివరికి  15 నిమిషాల్లో ఆమె   నేర్చుకొంది. కుట్టుపని శిక్షణలో పదును తేలడం బెగ్గర్స్‌ కార్పొరేషన్‌కు మరింత ప్రోత్సహాన్నిచ్చిందనీ, వారికి చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చాలనే నమ్మకాన్ని తమలో పెంచిందని  చంద్ర చెబుతారు. 

‘‘వారి జీవితాలను మార్చడంలో ఎంతవరకు విజయం సాధించానో  ఖచ్చితంగా తెలియదు, కానీ బనారస్  బెగ్గర్స్ కార్పొరేషన్  ద్వారా నేను మారును. నేను ఒక మాధ్యమం మాత్రమే.  నిజానికి నేను యూపీకి చెందిన వాడ్నికాను.  వారణాసి ప్రజలతో నాకు సంబంధం లేదు. కానీ వృద్ధి సమానంగా ఉండాలని ఈ ఉద్యమం నాకు నేర్పింది. మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించే వరకు రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. బిచ్చగాళ్లు పారిశ్రామికవేత్తలు కాగలిగితే,  నిరుద్యోగం అనేదే ఉండదు’ అంటారు చంద్ర.  విరాళాలకు బదులుగా  పెట్టుబడులను  ప్రోత్సహించాం తద్వారా బిచ్చగాళ్ళు వ్యవస్థాపకులుగా మారారు.  ఈ రకమైన చర్య  ప్రపంచంలోనే మొదటిది, ఏకైక చొరవ  అని  ఆయన పేర్కొన్నారు.

అవార్డులు, రివార్డులు
ఈ మిషన్‌లో ఒక్కో  బిచ్చగాడికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. వీటిలో రూ. 50వేల మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తి సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఖర్చు చేస్తారు.  
♦ దీంతోపాటు వారణాసి ఘాట్‌ల వద్ద అడుక్కునే పిల్లలకు సహాయం చేయడానికి మిశ్రా స్కూల్ ఆఫ్ లైఫ్‌ను కూడా స్థాపించారు. బెగ్గర్స్ కార్పొరేషన్ చంద్ర మిశ్రాకు 100 ఇన్నోవేటివ్ స్టార్టప్‌లలో స్థానం సంపాదించిపెట్టింది. తరువాత  టాప్ 16 మైండ్‌ఫుల్ స్టార్టప్‌లలో  చేరారు.
♦  ప్రారంభంలో 57 మంది తన ప్రచారానికి నిధులు సమకూర్చారు . వారి డబ్బుతో, మిశ్రా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని ఏర్పాటు చేశారు.
♦ బెగ్గర్స్ కార్పొరేషన్స్ అనేక అవార్డులను  కూడా అందుకుంది. స్టార్టప్ ఇండియా సహకారంతో లెమన్ ఐడియాస్ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్ గ్లోబల్ స్టార్టప్ కాంటెస్ట్‌లో ఇది బెస్ట్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement