అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డే Ambani family set to have a grand birthday for their granddaughter Veda in cruise ship | Sakshi
Sakshi News home page

అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డే

Published Fri, May 31 2024 5:33 PM | Last Updated on Fri, May 31 2024 6:00 PM

Ambani family set to have a grand birthday for their granddaughter Veda in cruise ship

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌అంబానీ తన మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలను ఏకంగా క్రూయిజ్‌ షిప్‌లో జరుపుకునేలా ప్లాన్‌ చేశారు. ముఖ్‌శ్‌ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్‌ అంబానీ-శ్లోకామెహతాల కూతురు వేదాఆకాశ్‌అంబానీ బర్త్‌డే వేడుకలను 900 మంది సెలబ్రిటీలతో కలిసి సముద్రంలో జరుపుకుంటున్నారు.

అపరకుబేరుడు ముఖేశ్‌అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ఈ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు. మే 29న మొదలైన ఈవేడుక జూన్‌1న ముగియనుంది. అయితే మే31న అనంత్‌ అన్నయ్య-వదినల కూతురు వేదా మొదటి పుట్టినరోజు. దాంతో పెళ్లి వేడుకల్లోనే ఈ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే అనంత్‌-రాధిక జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ను అంగరంగవైభవంగా జరుపుకున్నారు.

ఇదీ చదవండి: ఏఐతో వై-ఫై స్పీడ్‌ పెంచేందుకు పెట్టుబడులు

ఆకాశ్‌-శ్లోకా మెహతాలకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీ, ​​కూతురు వేదా. పృథ్వీ డిసెంబర్‌ 2020లో జన్మించాడు. వేదా మే 31, 2023లో పుట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement