ఎయిర్‌టెల్‌ నెత్తిన పాలు పోసిన పేటీఎం! Airtel Payments Bank Sees Spike With New Customers | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ నెత్తిన పాలు పోసిన పేటీఎం!

Published Fri, Feb 9 2024 8:40 PM | Last Updated on Fri, Feb 9 2024 9:03 PM

Airtel Payments Bank Sees Spike With New Customers - Sakshi

గత కొద్ది రోజులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు యూజర్ల తాకిడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఫాస్టాగ్‌ వంటి ఆఫర్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని సీఈఓ అనుబ్రత బిస్వాస్ తెలిపారు. అయితే, మరో పేమెంట్‌ బ్యాంక్‌ పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలతోనే ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు యూజర్లు క్యూకట్టారా? లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.  

ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ల స్వీకరణ, ఫాస్టాగ్‌ కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆర్‌బీఐ పేటీఎంను ఆదేశించింది. అయితే, ఇది ఆర్‌బీఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెగ్యులేటరీ నిబంధనల్ని పేటీఎం పాటించకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

5 నుంచి 7 రెట్లు పెరిగిన యూజర్లు
అదే సమయంలో పేటీఎం యూజర్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా లావాదేవీలు సంఖ్య పెరిగింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కరెంట్‌ అకౌంట్స్‌, యూపీఐ, ఫాస్టాగ్‌తో పాటు ఇతర సర్వీసుల్ని వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య జనవరి నుంచి 5-7 రెట్లు ఎక్కువ చేరిందని సీఈఓ బిశ్వావ్‌ తెలిపారు.  

59మిలియన్లకు పెరిగి 
ఇదిలా ఉండగా,ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబరు 2023 త్రైమాసికంలో రూ. 469 కోట్ల ఆదాయంలో వృద్ధిని కనబరించింది. దీంతో ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి నికర లాభం రూ.11 కోట్లకు చేరిందని పేర్కొంది. సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈ మొత్తం 120 వృద్దిని నమోదు చేసింది. బ్యాంక్ నెలవారీ లావాదేవీలు జరిపే యూజర్లు 59 మిలియన్లకు పెరిగారు. భారీ స్థాయిలో డిపాజిట్లు చేశారు. ఇది త్రైమాసికంలో సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.2,339 కోట్లకు చేరుకుంది.

అంతకంతకూ ఎయిర్‌టెల్‌ ఆదాయం
బ్యాంక్‌ గ్రాస్‌ మెర్చండైజ్‌ వ్యాల్యూ రూ. 2,62,800 కోట్లకు చేరింది. ఇ​క  డెబిట్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో సహా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇతర సేవల వల్ల.. కస్టమర్ల నుంచి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవల్ని వినియోగించుకున్నందుకు గాను ఎయిర్‌టెల్‌ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement