24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు | EC Notice To Chandrababu Over Election Code Violation In AP | Sakshi
Sakshi News home page

24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు

Published Mon, Mar 18 2024 9:01 PM | Last Updated on Thu, Mar 21 2024 1:05 PM

EC Notice To Chandrababu Over Election Code Violation In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్‌ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.

ఎక్స్(ట్విటర్‌), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్‌ కుమార్‌మీనా స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement