ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష.. CS Review Of Employee Residences | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష..

Published Sat, Aug 12 2023 3:39 PM | Last Updated on Sat, Aug 12 2023 7:28 PM

CS Review Of Employee Residences - Sakshi

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు.

అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి  సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు.

పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు.

ఆరోగ్య పథకంపై చర్చ..
రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో  ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు.

మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.ఈపథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు.అంతేగాక ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.

సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు.

ఇదీ చదవండి: ‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement