షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..? | Baireddy Rajasekhar Reddy vs MLA Jayasurya | Sakshi
Sakshi News home page

షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..?

Published Sat, Jul 6 2024 12:35 PM | Last Updated on Sat, Jul 6 2024 12:35 PM

Baireddy Rajasekhar Reddy vs MLA Jayasurya

మాండ్ర, బైరెడ్డి వర్గాల మధ్య  రగులుతున్న చిచ్చు 

నందికొట్కూరులో పట్టు కోసం  ఇరువర్గాల ప్రయత్నం 

బైరెడ్డి జోక్యాన్ని సహించేది లేదంటున్న ఎమ్మెల్యే జయసూర్య

ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయిన నందికొట్కూరు నియోజకవర్గంలోని టీడీపీలో నిప్పు లేకుండానే ‘పచ్చ’గడ్డి భగ్గుమంటోంది. అగి్నకి ఆజ్యం తోడైనట్లు ఎన్నికల వేళ ఏర్పడిన విభేదాలకు ఇప్పుడు అధికార దర్పం చాటేందుకు ఇరువర్గాలు పోటాపోటీ పడుతున్నాయి. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు నాయకులు లోలోపల పావులు కదుపుతున్నారు. ఓ వైపు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పట్టు సాధించేందుకు చక్రం తిప్పుతుండగా మాండ్ర శివానందరెడ్డి వర్గం చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది.    

సాక్షి, నంద్యాల: నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. సాధారణ ఎన్నికల నుంచి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రెండు వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నా గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్‌ మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన జయసూర్యకు దక్కాయి. 

రెండు వర్గాలు టీడీపీలో ఉన్నా ఒకరినొకరు సహకరించుకున్న పరిస్థితి లేదు. ఎవరి ప్రచారం వారే చేసుకున్నారు. ప్రత్యర్థుల్లానే వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అదే ధోరణి వ్యవహరిస్తుండటంతో వ్యవహారం తారా స్థాయి చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు వర్గాల మధ్య రగడకు దారి తీశాయి. మాండ్ర వర్గం బైరెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

అప్పటి నుంచే రెండు వర్గాలు ఉప్పు.. నిప్పులా.. వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఓటు ‘నీకు ఇష్టమొచ్చిన వారికి వేసుకోవచ్చని’ మాండ్ర వర్గం బాహటంగానే పిలుపునిచ్చింది. అలాగే ‘ఎమ్మెల్యే ఓటు మీకు నచ్చిన వారికి వేసుకొని ఎంపీ ఓటు శబరికి వేయండి’ అంటూ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లోలోపల ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మాండ్ర వర్గానికి చెందిన జయసూర్య, ఎంపీగా బైరెడ్డి శబరి ఇద్దరూ గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై పెత్తనం కోసం రెండు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

బైరెడ్డి వ్యాఖ్యలు కలకలం.. 
ఇటీవల బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. వలంటీర్లు, మధ్యాహ్న భోజనం కార్మికుల ఉద్యోగాలకు కొంత మంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీకి చెడ్డ పేరు వచ్చేలా నియోజకవర్గంలో ఎవరైనా ప్రవర్తిస్తే ‘తోలు ఒలిచి ఉప్పుకారం పెడతానని’ ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యే జయసూర్యను ఉద్దేశించే బైరెడ్డి హెచ్చరికలు చేశారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగింది. దీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది.  

షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..? 
నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచి నప్పటికీ ఆమెను డమ్మీని చేసి జిల్లాలో రాజకీయం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికే తీసుకొని రావాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వమే తీసుకోకుండా టీడీపీ నాయకులపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనం చేస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల షాడో ఎంపీగా వ్యవహరిస్తున్న బైరెడ్డిపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముదిరిన వివాదం 
తాజాగా శుక్రవారం నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డితో పాటు మరో 12 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో  తెలుగుదేశం పారీ్టలో చేరారు. ఈ చేరికలపై ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు కనీస సమాచారం ఇవ్వలేదు. బైరెడ్డి మొత్తం చక్రం తిప్పారు. తనకు తెలియకుండా టీడీపీలో కౌన్సిలర్లు చేరడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం లేని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనాన్ని సహించేది లేదని బహిరంగంగానే ఎమ్మెల్యే తేలి్చచెబుతున్నారు.

 నా సత్తా  ఏమిటో చూపిస్తా..  ఎమ్మెల్యే జయసూర్య 
ఇంత వరకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తెలుగుదేశం   పారీ్టలో సభ్యత్వమే లేదని, అలాంటి వ్యక్తి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను, చైర్మర్‌ను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్యే జయసూర్య విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని, బైరెడ్డి ఇప్పటి వరకు కండువా కూడా కప్పుకోలేదని, అలాంటి వ్యక్తి వేరే వాళ్లకు ఎలా కండువ కప్పి పారీ్టలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అవినీతి చేసిన వ్యక్తులను కాపాడేందుకే బైరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌లో రికార్డు చేశారన్నారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు కృషి చేసిన వ్యక్తుల్లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదని, ‘నా సత్తా ఏమిటో చూపిస్తా’ అంటూ సమావేశంలో వ్యాఖ్యానించారు. 

ఎవరికి భయపడొద్దు.. మీకు నేను ఉన్నా : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 
‘ఎవరి బెదిరింపులకు భయపడవద్దు. అందరం కలిసికట్టుగా పేదల అభ్యున్నతికి పని చేద్దాం. నేను మీకు అండగా ఉంటా’ అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డితో పాటు 12మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ నుండి టీడీపీలో చేరిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రెండు సార్లు నందికొట్కూరు ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ సమయంలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధే నేటికి అందరికీ కనబడుతుందన్నారు. తమ కుటుంబం ఇప్పటికీ ప్రజల్లో  ఉండేందుకు అప్పట్లో చేసిన అభివృద్ధే కారణమన్నారు. ఎంపీ శబరి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నందికొట్కూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు సాధించి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement