వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు | AP Police Have Registered Case Against YS Jagan And Two IPS Officers, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు

Published Fri, Jul 12 2024 12:46 PM | Last Updated on Fri, Jul 12 2024 1:48 PM

Police Have Registered Case Against Ys Jagan

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్‌ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తే.. మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైఎస్‌ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు.

ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్‌ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై  కేసు నమోదు చేయించడం ద్వారా.. టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.

వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. సీఐడీ మాజీ డీజీ  ట్వీట్‌
తనపై కేసు నమోదు చేయడంపై సీఐడీ మాజీ డీజీ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడాన్ని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సునీల్‌ ట్వీట్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement