కన్నబాబు ఆస్తులు రూ.36 కోట్లు - | Sakshi
Sakshi News home page

కన్నబాబు ఆస్తులు రూ.36 కోట్లు

Published Sat, Apr 20 2024 2:05 AM | Last Updated on Sat, Apr 20 2024 2:05 AM

-

● భార్య రాధాదేవి పేరిట రూ.రూ.14కోట్లు ● ఇద్దరి పేరిట రూ.15కోట్ల అప్పు

యలమంచిలి రూరల్‌: యలమంచిలి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు) ఆస్తులు రూ.36.72 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. వీటిలో చరాస్తులు సుమారు రూ.16.05 కోట్లు, స్థిరాస్తులు సుమారు రూ.20.67 కోట్లు ఉన్నాయి. భార్య రాధాదేవి పేరిట చర,స్థిరాస్తులు రూ.14.56 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. చరాస్తులు సుమారు రూ.6.39 కోట్లు, సుమారు స్థిరాస్తులు రూ.8.17 కోట్లు ఉన్నాయి. ఇద్దరికీ సొంత కారు లేదని తెలిపారు. కన్నబాబు పేరిట రూ.12.21 కోట్లు, భార్య రాధాదేవి పేరిట రూ.3.22 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్‌లో పొందుపరిచారు.కన్నబాబుపై క్రిమినల్‌ కేసులేవీ లేనట్టు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement