జియో డేటా కుదింపు కూడా శుభవార్తేనట! Reliance Jio users, here's why new limit on data is good news | Sakshi
Sakshi News home page

జియో డేటా కుదింపు కూడా శుభవార్తేనట!

Published Sat, Dec 3 2016 4:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

జియో డేటా కుదింపు కూడా శుభవార్తేనట!

కోల్కత్తా : జియోపై వినియోగదారులకు అందిస్తున్న ఉచిత సేవలన్నింటిన్నీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ గుడ్న్యూస్లోనే మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. అదేమిటంటే ప్రస్తుతం డేటాపై అందిస్తున్న రోజుకు 4జీబీ పరిమితిని 1జీబీకి కుందించారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఉచిత సేవలను మార్చి 31వరకు వినియోగించుకోవచ్చని, కానీ డేటా లిమిట్ను తగ్గిస్తున్నట్టు రిలయన్స్ అధినేత గురువారం వెల్లడించారు. ఇది కూడా వినియోగదారులకు గుడ్న్యూసేనట. ఎలానో తెలుసా? జియో డేటా వాడకంపై లోడ్ తగ్గి, మంచి 4జీ అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చట.పరిమితిని తగ్గించడంతో దారుణంగా ఉన్న జియో స్పీడ్ను మెరుగుపరుచుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. జియో డేటా పరిమితిని తగ్గించడంతో తను చేధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని, మార్చి చివరి వరకు 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంటుందని జేపీ మోర్గాన్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. 
 
నెట్వర్క్ వినియోగాన్ని తగ్గించి, మంచి క్వాలిటీ సర్వీసులను వినియోగదారులకు అందించాలని, దీంతో ఉచిత ఆఫర్ ముగిసినా ఈ సిమ్పైనే యూజర్లు కొనసాగుతారని క్రెడిట్ స్యూజ్ కూడ తెలిపింది. సంచలమైన ఆఫర్లతో ఎంత స్పీడుగా జియో మార్కెట్లోకి ప్రవేశించిందో అంత స్పీడుగా దాని ఇంటర్నెట్ లేదని పలువురు కస్టమర్లు వాపోయారు. అంతేకాక జియో డేటా సేవలు దారుణంగా ఉన్నాయంటూ, నెట్ స్పీడ్ మిగతా టెలికాం కంపెనీలతో పోటిస్తే స్లోగా ఉందంటూ టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కూడా గుట్టురట్టు చేసింది. దీంతో కస్టమర్లను పోగొట్టుకోకుండా ఉండటానికి, వారికి స్పీడ్ డేటాను అందించడానికి డేటా పరిమితిలో రిలయన్స్ జియో కోత విధించింది. ఈ నేపథ్యంలోనే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు వినియోగదారులకు ఉచిత సేవలను ప్రకటించిన జియో, రోజువారీ డేటా పరిమితిని తగ్గిస్తున్నట్టు పేర్కొంది. వాయిస్ సేవలు జీవిత కాలంపాటు అందిస్తామని పేర్కొంది.      
 

Advertisement
 
Advertisement
 
Advertisement