జామపండు ఫేషియల్‌ ప్యాక్‌ beauty tip | Sakshi
Sakshi News home page

జామపండు ఫేషియల్‌ ప్యాక్‌

Published Mon, Feb 20 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

జామపండు ఫేషియల్‌ ప్యాక్‌

బ్యూటిప్స్‌

బాగా పండిన జామ పండును తీసుకుని రెండు భాగాలుగా చేయాలి. మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలకు రెండు లేదా మూడు జామాకులను కలపి పేస్ట్‌ చేసుకోవాలి. ఒక స్పూను పేస్ట్‌ను చిన్న బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్‌లో రెండు స్పూన్లు పాలు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి.

ముందుగా ముఖాన్ని నీటితో కడిగి క్లెన్సింగ్‌ చేయాలి. పేస్ట్‌ను ముఖంపై వలయాకారంలో రబ్‌ చేయాలి. పది నిమిషాలపాటు మసాజ్‌ చేసి తడి కాటన్‌ బాల్స్‌తో ముఖాన్ని క్లీన్‌ చేయాలి. ఫేషియల్‌ ప్యాక్‌ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి చేస్తే యాక్నే సమస్య రాకుండా ఉంటుంది. చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement