'సాక్షి' కథనాలపై స్పందించిన చంద్రబాబు while reacting on sakshi stories chandrababu action on sand mafia | Sakshi
Sakshi News home page

'సాక్షి' కథనాలపై స్పందించిన చంద్రబాబు

Published Sat, Oct 22 2016 10:59 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

'సాక్షి' కథనాలపై స్పందించిన చంద్రబాబు - Sakshi

విజయవాడ: ఇసుక అక్రమ రవాణాపై 'సాక్షి' టీవీ అందించిన కథనాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ దందా చేస్తున్న వారిపై శనివారం విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా లింగాయపాలెం, వెంకటపాలెం, మరికొన్ని ఇసుక రీచ్ లపై ఆకస్మిక దాడులు చేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొందరు వ్యక్తులను ఆరెస్ట్ చేసి, 20 ఇసుక లోడ్ లారీలను సీజ్ చేశారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే జరుగుతున్న అక్రమ దందాను సాక్షి మీడియా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన చంద్రబాబు ఇసుక అక్రమ దందాపై చర్యలకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రీచ్ లపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement