నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు Nestle India after 16 years as chief of the Indian | Sakshi
Sakshi News home page

నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు

Published Sat, Jul 25 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు

న్యూఢిల్లీ : మ్యాగీ ఉదంతంతో స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే కంపెనీ తన ఇండియా విభాగపు అధిపతిని తొలగించింది. ప్రస్తుతం నెస్లే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఇటిన్నె బెనెట్‌ను తొలగించి సురేశ్ నారాయణన్ నియమించింది. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడిని ఈ ఉన్నత పదవిలో నెస్లే నియమించింది.  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్  అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం కారణంగా మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే కంపెనీ స్టోర్స్ నుంచి ఉపసంహరించింది.  1999లో నెస్లేలో చేరిన నారాయణన్ ప్రస్తుతం నెస్లే ఫిలిప్పైన్స్ చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement