గాళ్‌ఫ్రెండ్‌ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే.. Watch,Gorilla Bathtub Dance Viral | Sakshi
Sakshi News home page

గాళ్‌ఫ్రెండ్‌ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..

Published Wed, Apr 22 2020 6:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:01 AM

డల్లాస్‌ : చిన్నతనంలో నీళ్లున్న బకెట్‌లోకో లేదా టబ్బులోకో దిగి కేరింతలు కొడుతూ ఆడుకున్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేము. సంతోషమంతా మనదే అన్నట్లుగా ఆడుకున్న అమాయకత్వపు రోజులు మళ్లీ రావు. ఏదో ఒక సందర్భంలో ఆ సంఘటనలు గుర్తుకొచ్చినపుడు మాత్రం​ మనసు అదోలాంటి భావంతో ఉప్పొంగుతుంది. మన చిన్నతనాన్ని గుర్తుచేసేలా బాత్‌ టబ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసేసింది ఓ గొరిల్లా. డల్లాస్‌ జూకు చెందిన జోలా అనే మగ గోరిల్లా నీటితో నింపిన బాత్‌టబ్‌లోకి దిగి ఒళ్లు మైమరిచిపోయింది. అటుఇటు తిరుగుతూ.. చేతుల్తో నీటిని చిమ్ముతూ సంతోషంతో ఆడింది.

2017లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ దానికో శీర్షికను కూడా పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు..‘‘ గాళ్‌ఫ్రెండ్‌ తన ప్రేమను ఒప్పుకుందేమో, అందుకే ఈ సంతోషం... అది నేనే! ఓ వారం రోజుల తర్వాత స్నానం చేసినపుడు..  అతడెంతలా సంతోష పడుతున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.