ఈఎస్‌ఐ స్కామ్‌ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు ESI Scam: Huge Irregularities Emanating | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ స్కామ్‌ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు

Published Sat, Feb 22 2020 7:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

వందల కోట్లు నొక్కేసిన ఈఎస్‌ఐ స్కామ్‌లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలతో కుమ్మక్కైన గత మంత్రులు.. 237 కోట్ల ల్యాబ్ కిట్లు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేసినట్టు బట్టబయలయింది. ఓమ్నీ మెడి, అవెంతార్, లెజెండ్‌ కంపెనీలకు ల్యాబ్ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి.. 85 కోట్లు దోపిడీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు  గుర్తించారు. రూ. 90 విలువైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌కు రూ.190 చెల్లించారు. 25 రూపాయల థైరాయిడ్‌(1ఎంజీ) కిట్‌కి రూ.93 పెట్టి కొనుగోలు చేశారు. రూ.155 ధరగల షుగటర్‌ టెస్ట్‌ కిట్‌కి రూ.330 చెల్లించారు. 

Advertisement