పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని వినతి - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని వినతి

Published Fri, Jun 21 2024 2:24 AM | Last Updated on Fri, Jun 21 2024 2:24 AM

పీహెచ

మోత్కూరు : మున్సిపల్‌ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా మార్చడంతో పాటు ఆసుపత్రిలో శవ పరీక్ష కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

యోగాతో

మానసిక ప్రశాంతత

భువనగిరి : యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాడెం రాజశేఖర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని రాంనగర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ మాజీ గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్‌, గౌరవ అధ్యక్షుడు చింతకింది కృష్ణమూర్తి, సభ్యులు చామల వెంకటనారాయణరెడ్డి,మల్లీకార్జునచారి, పడాల భాస్కర్‌,యాదగిరి, ఉపేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి,వెంకట్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్‌, రవీందర్‌, యాదగిరి, ఇస్తారి, నరేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ : యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువు పాలకూర్ల పాండు అన్నారు. పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌కాలనీలో సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముటుకుల్లోజు నీరజ, పోలోజు శ్రీలత, చింతల రజిత, వనం మమత, ధనలక్ష్మి, ఊడుగు కల్పన, పద్మ, వెంకటమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

బీబీనగర్‌: మండలంలోని గుర్రాలదండి, జంపల్లి, మాదారం, రావిపహాడ్‌, ముగ్దుంపల్లి, గొల్లగూడెం, భట్టుగూడెం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపియనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ మనోహర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్రాలదండి సబ్‌స్షేషన్‌లో మరమ్మతు పనులు ఉన్నందున విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ధర్నాను జయప్రదం చేయాలి

భువనగిరిటౌన్‌ : ఈ నెల 24న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి బోడ ఉదయభాగ్య అన్నారు. గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు పసుపుల బుచ్చమ్మ , వసంత, వరమ్మ, లక్ష్మీ, లలిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

గుండాల : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీపీ తాండ్ర అమరావతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ దేవిక, డాక్టర్‌ హైమావతి, ఎండీ ఖలీల్‌, రాములు పాల్గొన్నారు.

విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆత్మకూరు(ఎం): విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేజీబీవీ ప్రత్యేక అధికారి ఎం.పద్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవి విద్యార్థులకు నోట్‌ , పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది స్వరూప, సంధ్యారాణి, జావెద్‌సుల్తానా, అంజుమర, సరిత, మహేశ్వరి, రజిత పాల్గొన్నారు.

నోట్‌బుక్స్‌ పంపిణీ

రాజాపేట : మండలంలోని దూదివెంకటాపురం గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గ్రామానికి చెందిన నక్కీర్త కనకరాజు గురువారం నోట బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చామకూర గోపాల్‌ గౌడ్‌, ఎంపీటీసీ ఎర్రోళ్ల స్వరూప బాబు నాయకులు వగల భిక్షపతి, ధర్మారెడ్డి, రాజు, సిద్దులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలరామారం : మండలంలోని మైలారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం బండ బాబురావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు డాక్టర్‌ సిరి వెన్నెల, రేవంత్‌ కుమార్‌లు నోట్‌ బుక్స్‌, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిరివెన్నెల, మాజీ సర్పంచ్‌ బండ వెంకటేష్‌, అశోక్‌, శ్యామల్‌ రెడ్డి, గిరి ప్రసాద్‌, మహేష్‌, బాబు, సుల్తాన, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పీహెచ్‌సీని 30 పడకల  ఆస్పత్రిగా మార్చాలని వినతి
1/1

పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని వినతి

Advertisement
 
Advertisement
 
Advertisement