ఉపాధ్యాయుల వేకెన్సీ జాబితా వెల్లడి - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల వేకెన్సీ జాబితా వెల్లడి

Published Sat, Jun 22 2024 1:34 AM | Last Updated on Sat, Jun 22 2024 1:34 AM

-

విద్యారణ్యపురి: ఎస్జీటీల తత్సమానమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన వేకెన్సీల వివరాల్ని ఉపాధ్యాయ సంఘాలకు, ఆయా టీచర్ల వాట్సాప్‌ గ్రూపులకు అధికారులు శుక్రవారం పంపించారు. హనుమకొండ జిల్లాలో ఎస్జీటీల తత్సమాన ఉపాధ్యాయుల వేకెన్సీలు 357 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో క్లియర్‌ వేకెన్సీలు 202, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్ల వేకెన్సీలు 155 వరకు ఉన్నట్లుగా ప్రాథమికంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. స్పౌజ్‌ కేటగిరీలో బదిలీలు కావాలనుకునేవారు సమర్పించిన దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై తెలిపారు. స్పౌజ్‌ ఇప్పటికే బదిలీ అయినా.. ఉద్యోగ విరమణ పొందినా, దివ్యాంగులై ఉన్నా ఈనెల 22వ తేదీ(శనివారం) సాయంత్రం వరకు 99481 88254కు వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వరంగల్‌ జిల్లాలో మరో 76 మంది తత్సమాన స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. జిల్లాలో మొత్తం 434 మంది టీచర్లకు పదో న్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్‌ జిల్లాలోనూ ఎస్‌జీటీ తత్సమాన ఉపాధ్యాయుల బది లీల ప్రక్రియ జరగనుంది. వేకెన్సీలు 606 ఉన్నాయి. క్లియర్‌ వేకెన్సీలు 278 ఉన్నాయి, 8సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్ల వేకెన్సీలు 328 ఉన్నాయి. వీటిపై అభ్యంతరాలుంటే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement