సేంద్రియం.. అవసరం - | Sakshi
Sakshi News home page

సేంద్రియం.. అవసరం

Published Fri, Jun 21 2024 8:24 AM | Last Updated on Fri, Jun 21 2024 8:24 AM

సేంద్

నవాబుపేట: సేంద్రియ ఎరువులపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతో రైతులు దృష్టిసారించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఏటా పెట్టుబడులు పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ సమస్య నుంచి రైతులుబయట పడేందుకు సేంద్రియ ఎరువుల తయారీ విధానం, వినియోగంతో కలిగే ప్రయోజనాలపై రైతులకు పూర్తి స్తాయిలో అవగాహన కల్పిండమే. మండల వ్యవసాయ అధికారులు మాత్రం ఇందులో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్థిక భారం.. నష్టం

రసాయన ఎరువుల వాడకం రైతులకు భారంతో పాటు నష్టం. భూసారం సైతం తగ్గుతోంది. ఆశించిన దిగుబడులు రావు. పర్యావరణంపై రసాయనిక ఎరువుల ప్రభావం చూపుతుంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. అదే స్థాయిలో సేంద్రియ ఎరువులు వేస్తే చీడపీడల బెడద తప్పడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. వ్యవసాయంలో సరైన సలహాలు, చూచనలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. దీంతో రైతులకు పంటకు సోకిన రోగాలకు ఏ దశలో ఏ మందులు వాడాలో తెలియక వ్యాపారులు ఇచ్చే నాణ్యతలేని నకిలీ మందులు వాడుతూ నష్టపోతున్నారు. సేంద్రియ ఎరువులు ఆరుతడి పంటలకు కూరగాయల సాగుకు ఎంతో ఉపయోగపడుతాయి.

రైతు ఇంట సిరులు

సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలైనవని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఆకులు, అలములు, చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. ముందుగా తమకు అవసరమున్న కుండీలను ఏర్పాటు చేసుకుని ముడి సరుకు సేకరించి కొంత వరకు నీటిలో వేసి దాదాపు 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువు తయారవుతుంది. అనంతరం దానిని పంటలకు ఉపయోగించవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుంది. వర్మి కంపోస్టుతో అధిక దిగుబడులు పొందవచ్చు. చెరువు ఒండ్రుమట్టిని తరలించుకోవడం, జీలుగ పంటను సాగు చేసుకుని పొలం కలియదున్నడం లాంటి పద్ధతులు పాటించినా మేలే. ఎక్కువ మొత్తంలో రసయనాలు వాడే భూముల్లో అప్పుడప్పుడు సేంద్రియ ఎరువులు వేస్తే భూసారం సమతుల్యంగా ఉంటుంది. పశువుల ఎరువులు, పొల్లాల్లో గొర్రెల మందలు వేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయి. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఇప్పటికై నా సంబందిత అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

అవగాహన కల్పనలో అలసత్వం

రసాయన ఎరువుల వైపే రైతుల మొగ్గు

పెరుగుతున్న ఖర్చులు

తగ్గుతున్న దిగుబడులు

అవగాహన కల్పిస్తాం

సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తాం. రైతులకు అందుబాటులో ఉండే పశువుల, గొర్రెల ఎరువును పొలాల్లో వేసుకోవాలి. జీవన ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వర్మికంపోస్టు బెడ్లు, వానపాములు ఇపుడు రావడం లేదు.

– ప్రసన్నలక్ష్మి, మండల వ్యవసాయాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
సేంద్రియం.. అవసరం
1/1

సేంద్రియం.. అవసరం

Advertisement
 
Advertisement
 
Advertisement