జనావాసాల్లోకి కొండచిలువ - | Sakshi
Sakshi News home page

జనావాసాల్లోకి కొండచిలువ

Published Wed, Jun 19 2024 9:38 AM | Last Updated on Wed, Jun 19 2024 9:38 AM

జనావాసాల్లోకి కొండచిలువ

మణికొండ: పన్నెండు అడుగుల పొడవు కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్‌ రోడ్డు నంబర్‌– 4లోని ఖాళీ స్థలంలో కొండచిలువ కనిపించింది. వెంటనే స్థానికులు స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పట్టుకున్నారు. పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వాటిని జూపార్కులో అప్పగిస్తామని స్నేక్‌ సొసైటీ సభ్యులు సూచించారు.

కవి విల్సన్‌ సుధాకర్‌కు ప్రతిష్టాత్మక రోమ్‌ పురస్కారం

సాక్షి, సిటీబ్యూరో: నాశ్చిరా అసోసియేషన్‌, బార్ట్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక ‘డొన్నె డ్ఙీఅమోర్‌’ (ఉమెన్‌ ఆఫ్‌ లవ్‌) అంతర్జాతీయ అవార్డుకు తెలుగు కవి తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 27న రోమ్‌ (ఇటలీ) వేదికగా అవార్డును స్వీకరించడానికి బార్ట్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ నుంచి ఆహ్వానం అందిందని విల్సన్‌ సుధాకర్‌ తెలిపారు. మహిళా ప్రపంచానికి ప్రేరణగా రాసే సాహిత్యానికి గౌరవంగా ఈ అవార్డును అందిస్తారు. సీ్త్రలపై సుధాకర్‌ రాసిన తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించగా.. ఆ కవిత్వం ఔన్నత్యాన్ని తెలుసుకొని దానిని ఇటాలియన్‌లోకి అనువదించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని సుధాకర్‌ వివరించారు. నగరానికి చెందిన సుధాకర్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జపాన్‌, దక్షిణాఫ్రికా, దుబాయ్‌లలో విధులు నిర్వహించారు. పేదల పక్షపాతిగా, సీ్త్రలు, బాలకార్మికులు, దళితులకు సంబంధించిన పలు అంశాలపై విల్సన్‌ సుధాకర్‌ రాసిన రచనలు ఆదరణ పొందాయి. ఆయన రాసిన పలు కవితలు ఆంగ్లం, ఇటాలియన్‌ భాషల్లోకి అనువాదమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement