TSPSC Paper Leak Issue: OU Student JAC Protests Turn High Tension - Sakshi
Sakshi News home page

ఓయూలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల చేతుల్లో పెట్రోల్‌ బాటిల్స్‌తో..

Published Fri, Mar 24 2023 2:19 PM | Last Updated on Fri, Mar 24 2023 7:26 PM

TSPSC Paper Leak Issue: OU Student JAC Protests Turn High Tension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనలతో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్‌ చైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలని, అదే సమయంలో జ్యూడీషియల్‌ విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్ష ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలకు దారి తీసింది. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ అంశంపై విద్యార్థులు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. విద్యార్థి నిరుద్యోగ మార్చ్‌ పేరుతో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి విద్యార్థి సంఘాలు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్‌ గేట్లు మూసేశారు. అయినప్పటికీ దీక్షకు దిగేందుకు యత్నించారు విద్యార్థులు. దీంతో.. 

పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు యత్నించగా..  ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో నగేష్‌ అనే విద్యార్థి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, పలువురి విద్యార్థులను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement