తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్‌ | Telangana Schools Begin, RTA Attacks Buses For Fitness | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్‌

Published Wed, Jun 12 2024 9:11 AM | Last Updated on Wed, Jun 12 2024 10:39 AM

Telangana Schools Begin, RTA Attacks Buses For Fitness

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్‌, ప్రైవేట్‌ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్‌, కాలేజీల బస్సుల ఫిట్‌నెస్‌లను పరిశీలిస్తున్నారు. ఫిట్‌గా లేని బస్సులు, వ్యాన్‌లను సీజ్‌ చేస్తున్నారు. 

మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట చెకప్‌ లిస్ట్‌ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్‌లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్‌నెస్‌ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. 

ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement