Telangana: వ్యాపారులకు శుభవార్త.. ఇక 24 గంటలూ షాపులు తెరవొచ్చు | Telangana Retail Shops May Stay Open 24 Hours | Sakshi
Sakshi News home page

TS: వ్యాపారులకు శుభవార్త.. ఇక 24 గంటలూ షాపులు తెరవొచ్చు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Published Sat, Apr 8 2023 3:29 AM | Last Updated on Sat, Apr 8 2023 10:25 AM

Telangana Retail Shops May Stay Open 24 Hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని జీవో జారీ చేశారు. తదనుగుణంగా తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988కు సవరణలు చేసినట్టు తెలిపారు.

24 గంటలపాటు దుకాణం తెరిచి ఉంచేందుకు గాను ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే ఈ జీవో అమలులో ఈ కింది పది నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

  1. ఐడీ కార్డులు జారీ చేయాలి
  2. వారాంతపు సెలవు ఇవ్వాలి 
  3. వారంలో కచ్చితమైన పనిగంటలు ఉండాలి 
  4. ఓవర్‌ టైమ్‌కు వేతనం చెల్లించాలి 
  5. పండుగలు, సెలవు దినాల్లో పని చేసినవారికి
  6. కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి 
  7. మహిళా ఉద్యోగులకు తగిన వేతనం ఇవ్వాలి
  8. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల అంగీకారం తీసుకోవాలి.. రవాణా సదుపాయం కల్పించాలి 
  9. రికార్డులను సరిగా మెయింటైన్‌ చేయాలి 
  10. పోలీస్‌యాక్ట్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
    చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement