గోల్కొండలో వజ్రోత్సవాల రిహార్సల్స్‌ | Telangana CS Somesh Kumar Inspects Arrangements At Golkonda | Sakshi
Sakshi News home page

గోల్కొండలో వజ్రోత్సవాల రిహార్సల్స్‌

Published Sun, Aug 14 2022 2:46 AM | Last Updated on Sun, Aug 14 2022 3:03 PM

Telangana CS Somesh Kumar Inspects Arrangements At Golkonda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈనెల 15న నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను శనివారం గోల్కొండ కోటలో నిర్వహించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోట నుంచి జాతీయ పతాకావిష్కరణ చేయ నున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి పూర్తి డ్రెస్‌ రిహార్సల్స్‌ జరిపారు. ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 

10.30 గంటలకు సీఎంకు గౌరవవందనం  
ఈనెల 15న ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పతాకావిష్కరణ కోసం సీఎం వచ్చేటప్పుడు వేయిమంది జానపద కళాకారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతా కావిష్కరణ చేసిన అనంతరం సీఎంకు రాష్ట్రీయ సెల్యూట్‌ను పోలీస్‌ దళాలు అందజేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేకపాసులు జారీ చేశారు.  

కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది. హాజరయ్యేవారికి మంచినీటి సౌకర్యంతోపాటు వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లను ఏర్పాటు చేశారు. రిహార్సల్స్‌ను పరిశీలించినవారిలో పోలీస్‌ శాఖ అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్‌ అడిషల్‌ డీజీ అనిల్‌ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, హైదరాబాద్‌ పోలీస్‌ కమి షనర్‌ సీవీ ఆనంద్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అమ య్‌ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement