Shamshabad: ప్రధాన టెర్మినల్‌ నుంచే విమాన సర్వీసులు Shamshabad: International Flights From Hyderabad Shift to Main Terminal | Sakshi
Sakshi News home page

Shamshabad: ప్రధాన టెర్మినల్‌ నుంచే విమాన సర్వీసులు

Published Thu, Nov 24 2022 3:09 PM | Last Updated on Thu, Nov 24 2022 3:14 PM

Shamshabad: International Flights From Hyderabad Shift to Main Terminal - Sakshi

శంషాబాద్‌: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్‌ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్‌ నుంచే అంతర్జాతీయ డిపార్చర్‌ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్‌ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్‌ ఆంక్షలు..  ఫిబ్రవరి 21 వరకు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement