ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు Nampally Court Rejects Bhujangarao Tirupattana Bail Petitions | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు

Published Wed, Jun 12 2024 6:38 PM | Last Updated on Wed, Jun 12 2024 7:14 PM

Nampally Court Rejects Bhujangarao Tirupattana Bail Petitions

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది.

రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తేగా.. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా..  ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో భుజంగరావు తిరుపతన్న ఉన్నారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement