ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత  | MLC Kavitha To Participate In Indian Library Congress In Kerala | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత 

Published Sun, Dec 18 2022 2:36 AM | Last Updated on Sun, Dec 18 2022 8:00 AM

MLC Kavitha To Participate In Indian Library Congress In Kerala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. కేరళలోని కన్నూరులో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పంపారు.

జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3న సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. సమావేశాలను కేరళ సీఎం విజయన్‌ ప్రారంభించనుండగా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు  తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement