బ్లడ్‌ డొనేషన్‌ పేరుతోనూ మోసాలు! | Police Arrested Man For Cheating People Who Seeking Emergency Blood Donors, Details Inside - Sakshi
Sakshi News home page

Blood And Plasma Fraud: బ్లడ్‌ డొనేషన్‌ పేరుతోనూ మోసాలు!

Published Tue, Sep 19 2023 11:46 AM | Last Updated on Tue, Sep 19 2023 12:17 PM

Man held for cheating people seeking blood - Sakshi

హైదరాబాద్: రక్తం, ప్లాస్మా వంటివి  అత్యవసరమైన వారిని సంప్రదించి, వారి నుంచి కొంత మొత్తం తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్‌ ఆ«దీనంలోని వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ శిల్పవల్లి శుక్రవారం పేర్కొన్నారు.   శ్రీకాకుళం జిల్లా, పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్‌ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆరి్థక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. 

ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. 2020లో కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్‌ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ కేంద్రంగా డోనర్స్‌ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్‌ డోనర్‌ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్‌ చేశాడు. ప్లాస్మా డోనర్స్‌ కోసం వాటిలో ప్రకటనలు ఇచి్చన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్‌ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్‌ గ్రూప్‌ అని నమ్మబలికే వాడు. 

తాను ప్లాస్మా డొనేట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్‌ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కొవిడ్‌ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు.

 ఇలా వసూలు చేసిన మొత్తాన్ని బెట్టింగ్‌లతో పెట్టేవాడని డీసీపీ తెలిపారు.  నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోనూ కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాజాగా మరోసారి సోషల్‌మీడియా వేదికగా బ్లడ్, ప్లాస్మా డొనేషన్‌ పేరుతో మోసాలు ప్రారంభించిన అతడిపై దోమలగూడ ఠాణాలో కేసు నమోదు కావడంతో వాంటెడ్‌గా మారాడు. సీసీఎస్‌లోని వెస్ట్‌జోన్‌ క్రైమ్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.భిక్షపతి నేతృత్వంలోని బృందం శుక్రవారం పట్టుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement