ఇల్లందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు Kidnap Case Filed On Congress MLA Koram Kanakaiah | Sakshi
Sakshi News home page

ఇల్లందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు

Published Mon, Feb 5 2024 10:00 PM | Last Updated on Mon, Feb 5 2024 10:05 PM

Kidnap Case Filed On Congress MLA Koram Kanakaiah - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్‌ను  ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌  ఇల్లందు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మ‌న్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేప‌థ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు.

మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement