ఖైరతాబాద్‌ గణేశ్‌.. ఈసారి 70 అడుగుల ఎత్తు Khairatabad Ganesh 2024 Height Will Be 70 Feets | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌లో ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేశ్‌: ఎమ్మెల్యే దానం

Published Mon, Jun 17 2024 5:39 PM

Khairatabad Ganesh 2024 Height Will Be 70 Feets

సాక్షి,హైదరాబాద్‌: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. సోమవారం​(జూన్‌17) గణేశ్‌ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్‌ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement