ఫోన్‌ ట్యాపింగ్‌పై నేడు విచారణ Inquiry on phone tapping case today | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌పై నేడు విచారణ

Published Tue, Jun 4 2024 4:27 AM | Last Updated on Tue, Jun 4 2024 4:27 AM

Inquiry on phone tapping case today

సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌అరాధే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కాజాశరత్‌ ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారంటూ ఓ పత్రికలో వచి్చన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ, సీఎస్, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

‘ఫోన్‌ ట్యాపింగ్, జీపీఎస్‌ లొకేషన్‌ నుంచి వివరాలు తెలుసుకొని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్‌ నుంచి రూ.90 లక్షలు, వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు్ల, జి.వినోద్‌ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్‌ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమ యంలో నగదు స్వాదీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌ కాజా ఫోన్లను కూడా ట్యాప్‌ చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచి్చన వాంగ్మూలంలో పేర్కొన్నారు.’అంటూ వచి్చన కథనాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement