ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా High Drama In Phone Tapping Case At Nampally Court | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా

Published Fri, Jun 21 2024 10:39 AM | Last Updated on Fri, Jun 21 2024 1:24 PM

High Drama In Phone Tapping Case At Nampally Court

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.

ఛార్జ్‌షీట్‌లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్‌లో ప్రణీత్‌ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్‌ చేసిన పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్‌ ఇస్తే ప్రణీత్‌రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. 

కొత్త ఛార్జ్‌షీట్‌ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement