ఈఎస్ఐ స్కామ్‌లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ED files Charge Sheet On ESI Scam | Sakshi
Sakshi News home page

ఈఎస్ఐ స్కామ్‌లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

Published Fri, Aug 25 2023 2:01 PM | Last Updated on Fri, Aug 25 2023 3:04 PM

ED files Charge Sheet On ESI Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్‌మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది.

మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్‌మాల్‌ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్‌ ప్లాట్స్‌ కమర్షియల్‌ షాప్‌లను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్‌ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement