Hyd: భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? | Drunk And Driving Cases Registered In Hyderabad On Jan 1, 2024 | Sakshi
Sakshi News home page

Hyd: భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?

Published Mon, Jan 1 2024 11:21 AM | Last Updated on Mon, Jan 1 2024 1:17 PM

Drunk And Driving Cases Registered In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు.

వివరాల ప్రకారం.. న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్‌ అనలైజర్‌ కౌంట్‌ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్  అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి  రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 

ఇది కూడా చదవండి: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో ‍డ్రగ్స్‌ స్వాధీనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement