ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు | CM Revanth Reddy New industrial policies to compete with world | Sakshi
Sakshi News home page

ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు

Published Wed, May 22 2024 4:41 AM | Last Updated on Wed, May 22 2024 4:41 AM

సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు

పరిశ్రమల శాఖ అధికారులకు సీఎం ఆదేశం 

టీఎస్‌ఐఐసీ కార్యకలాపాలపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల కోసం ఎంఎస్‌ఎంఈ విధానం, ఎగుమతుల విధానం, నూతన లైఫ్‌సైన్సెస్, మెడికల్‌ టూరిజం, ఈవీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 

గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత, వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోని పవర్‌లూమ్, చేనేత కారి్మకులకు ఉపయోగపడేలా విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement