హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్‌ఎంసీకీ సీఎం ప్రత్యేక ఆదేశాలు | Cm Revanth Alerts Ghmc Officials On Heavy Rain Forecast To hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్‌ఎంసీని అలర్ట్‌ చేసిన సీఎం రేవంత్‌

Published Tue, Jul 16 2024 10:51 AM | Last Updated on Tue, Jul 16 2024 11:30 AM

Cm Revanth Alerts Ghmc Officials On Heavy Rain Forecast To hyderabad

సాక్షి,హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నగరానికి మంగళవారం(జులై 16) సాయంత్రం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వాటర్ వర్క్స్, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని  హైదరాబాద్ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

భారీ వర్షం కురిసేటపుడు 141 లాగిన్ పాయింట్స్ వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉండి వెంటనే నీళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement