‘మోతె’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా - | Sakshi
Sakshi News home page

‘మోతె’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Published Fri, Jun 21 2024 2:20 AM | Last Updated on Fri, Jun 21 2024 2:20 AM

‘మోతె

మోతె : ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మోతె మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. గురువారం మోతె మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ముప్పాని ఆశ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు అందుతున్నాయా.. లేదా అనే విషయంపై రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. మండలంలో పెండింగ్‌ పనుల వివరాలు తనకు తెలపాలన్నారు. మండలంలో రోడ్ల అభివృద్ధికి రూ.5 కోట్లను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేసినట్లు తెలిపారు. నామవరంలో పశువైద్య ఉప కేంద్రం నిర్మాణానికి ఎస్టిమేషన్‌ వేసి నివేదిక అందించాలన్నారు. విద్యుత్‌ ఏఈ రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మరోసారి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని ఏఈని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. మండంలో ప్రజల నుంచి వచ్చిన ప్రజా సమస్యల ధరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీటీసీలు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సూర్యాపేట జెడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపిక, జెడ్పీటీసీ పుల్లారావు, ఆర్డీఓ, తహసీల్దార్‌ సంఘమిత్ర, ఎంపీడీఓ హరిసింగ్‌నాయక్‌, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి, మైనంపాటి గుర్వారెడ్డి, మధుసుదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కోదాడరూరల్‌ : మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో రూ.25 లక్షల మంత్రి నిధులతో చేపట్టిన ఖబరస్తాన్‌ ప్రహరీ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇమామ్‌, మౌజమ్‌ల గౌరవ వేతనాన్ని ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. పనుల్లో అలసత్వం వహించకుండా నాణ్యత ప్రమాణాలతో వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, టీపీసీసీ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంఏ జబ్బార్‌, కౌన్సిలర్లు నెమ్మాది వీరబాబు, మామిడి పద్మావతి, సంపెట రవి, మామిడి రామారావు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

మునగాల : మండలంలోని బరాఖత్‌గూడెంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు గురువారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ పార్టీ రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఇంద్రారెడ్డి, ముదిరెడ్డి, కనికిరెడ్డి, దొంతిరెడ్డి రామనర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలె సామియేలు, నాయకులు రెణబోతు వీరారెడ్డి, చేగొండి శ్రీనివాస్‌ యాదవ్‌, అలుగుబెల్లి కరుణాకర్‌రెడ్డి, గోవింద రామారావు, షేక్‌ పాషా పాల్గొన్నారు.

జానకమ్మ మృతి బాధాకరం

మునగాల : కలకోవకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జూకూరి గుర్వయ్య భార్య జానకమ్మ (72) మృతి బాధాకరమని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుధవారం అనారోగ్యంతో జానకమ్మ మృతిచెందారు. గురువారం కలకోవలో జరిగిన ఆమె అంత్యక్రియలకు పద్మావతి హాజరై నివాళులర్పించారు. అనంతరం గురవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పనస విజయ్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు పనస శంకర్‌, సీనియర్‌ నాయకులు దొంగరి అప్పారావు, పనస సింహాద్రి, పనస చిన్న శ్రీను, మాజీ సర్పంచ్‌ చిర్రా శ్రీనివాస్‌, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
‘మోతె’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
1/1

‘మోతె’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Advertisement
 
Advertisement
 
Advertisement