ఆల్బెండజోల్‌ మాత్రలతో పిల్లల్లో ఎదుగుదల - | Sakshi
Sakshi News home page

ఆల్బెండజోల్‌ మాత్రలతో పిల్లల్లో ఎదుగుదల

Published Fri, Jun 21 2024 2:18 AM | Last Updated on Fri, Jun 21 2024 2:18 AM

ఆల్బె

నాగారం : విద్యార్థులలో శారీరక, మానసిక ఎదుగుదలకు ఆల్బెండజోల్‌ మాత్రలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ మాత్రలను 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వి.మల్లయ్య, మండల వైద్యాధికారి డాక్టర్‌ హర్షవర్ధన్‌, ఏఎన్‌ఎం నాగమ్మ, ఉపాధ్యాయులు వెంకటమల్లు, వీరేష్‌, ఆశకార్యకర్తలు రేణుక, రోజా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి : ప్రతి ఆరు నెలలకు ఒకసారి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ పి.వెంకటరమణ అన్నారు. గురువారం తిరుమలగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మల్లెల వందన, సీహెచ్‌ఓ బిచ్చునాయక్‌, నర్సింహారెడ్డి, విజయ్‌ పాల్గొన్నారు.

అనంతారం మోడల్‌ స్కూల్‌లో..

1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని తిరుమలగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాగంటి అనసూయ రాములు అన్నారు. శనివారం అనంతారం మోడల్‌ స్కూల్‌లో, తొండ ప్రాథమిక పాఠశాలలో వైద్య శాఖ ఆధ్వర్యంలో మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, వైద్యాధికారిని మల్లెల వందన, మున్సిపల్‌ కమిషనర్‌ రామదుర్గారెడ్డి, మండల విద్యాధికారి శాంతయ్య, సీహెచ్‌ఓ బిచ్చునా యక్‌, ఉపాధ్యాయులు అశోక్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ స్వ రూపాకుమారి, ప్రిన్సిపాల్‌ బాలరాజు పాల్గొన్నారు.

జిల్లాలో 2,13,215మంది పిల్లలకు..

అర్వపల్లి : నులి పురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 2,13,215 మంది పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ చెప్పారు. అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యాసంస్థలతో పాటు ఇంటింటికీ తిరిగి ఈ నెల 27 వరకు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ సీహెచ్‌.మణిదీప్‌, హెచ్‌ఎం ఎం.విజయలక్ష్మి, ఏఎన్‌ఎం జ్యోతి, చిగుర్ల నర్సయ్య, ఎంపీహెచ్‌ఏ వీరయ్య, పీఈటీ లింగాల రవి, ఆశా కార్యకర్త ఎం.స్వరూప తదితరులు పాల్గొన్నారు.

అర్వపల్లిలోని కేజీబీవీలో..

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా గురువారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వపల్లిలోని కేజీబీవీలో బాలికలకు మండల వైద్యాధికారి డాక్టర్‌ చిలుకూరి మణిదీప్‌ మాత్రలు వేశారు. ఈ నెల 27 వరకు మాత్రల పంపిణీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి నాగరాణి, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశా కార్యకర్త స్వరూప, సీఆర్‌టీలు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌ : పౌష్టికాహారం తీసుకున్నట్లయితే నులిపురుగులను అరికట్టవచ్చని మండల వైద్యాధికారి స్రవంతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నకిరేకంటి రవి, ఎంపీఓ నరేష్‌, ఎస్‌ఓ ఆసియా భేగం, పీహెచ్‌ఎన్‌ అనంతలక్ష్మి, హెచ్‌ఈఓ చంద్రశేఖరరాజు, పంచాయతీ కార్యదర్శి శివ, ఏఎన్‌ఎం వీరమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తుంగతుర్తి : ిపల్లల ఎదుగుదలకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించాలని ఎంఈఓ బోయిని లింగయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ లింగమూర్తి, ఎంపీఓ భీంసింగ్‌, హెచ్‌ఈఓలు సముద్రాల సూరి, రవి, డిప్యూటీ పారామెడికల్‌ ఆఫీసర్‌ సురేష్‌కుమార్‌, పీహెచ్‌ఎన్‌ సైదమ్మ, జానకమ్మ, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్‌(ఎస్‌) : విద్యార్థులలో నులిపురుగుల నివారణతో రక్త హీనతను అరికట్టవచ్చునని డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం నెమ్మికల్లులో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వీరేంద్రనాఽథ్‌, సూపర్‌వైజర్‌ రంగమ్మ, పూలమ్మ, శ్రీనివాస్‌, రాజేంద్రప్రసాద్‌, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చివ్వెంల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్‌ కుమార్‌, వైద్యాధికారి జి.భవాని, హెచ్‌ఎం కళారాణి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శిరోమణి, ఏఎన్‌ఎం భిక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

నూతనకల్లు : విద్యార్థులలో నులిపురుగుల నివారణతో రక్త హీనతను అరికట్టవచ్చని ఎంపీటీసీ పన్నా ల రమామల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంఈఓ రాములు నాయక్‌, మండల వైద్యాధికారి అశ్రితారెడ్డి, ఎంపీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.

మద్దిరాల : నులిపురుగుల కారణంగా పిల్లలలో శారీరక ఎదుగుదల మందగిస్తుందని జెడ్పీటీసీ కన్న సురాంభ వీరన్నగౌడ్‌ అన్నారు. గురువారం జి.కొత్తపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నగేష్‌, ఏఎన్‌ఎం పల్లవి, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆల్బెండజోల్‌ మాత్రలతో పిల్లల్లో ఎదుగుదల
1/1

ఆల్బెండజోల్‌ మాత్రలతో పిల్లల్లో ఎదుగుదల

Advertisement
 
Advertisement
 
Advertisement