కుటుంబ సభ్యులకు బాలుడి అప్పగింత - | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులకు బాలుడి అప్పగింత

Published Fri, Jun 21 2024 12:58 AM | Last Updated on Fri, Jun 21 2024 12:58 AM

కుటుంబ సభ్యులకు బాలుడి అప్పగింత

ఉవవకొండ: ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు... ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ప్రయాణికులకు బుధవారం సాయంత్రం ఓ పదేళ్ల వయసున్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడిని తీసుకుని స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ రాఘవేంద్రప్ప, హెడ్‌ కానిస్టేబుల్‌ కులశేఖర్‌రెడ్డి తదితరులు బాలుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చీకటి పడడంతో రాత్రికి అక్కడే బాలుడిని ఉంచుకుని భోజన సదుపాయాలు కల్పించారు. అనంతరం గురువారం ఉదయం స్థానిక ఆపద్బంధావ ట్రస్ట్‌ సభ్యుల సహకారంతో బాలుడి ఆచూకీ తెలుసుకున్నారు. ఉరవకొండలోని ఇందిరానగర్‌కు చెందిన ఆనంద్‌ కుమారుడు కార్తీక్‌గా నిర్ధారించుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి స్టేషన్‌కు వచ్చి కుమారుడిని అక్కున చేర్చుకున్నాడు. కౌన్సిలింగ్‌ అనంతరం కుటుంబసభ్యులకు బాలుడిని అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement