విరాట్‌ కోహ్లి బుల్లెట్‌ త్రో.. గుజరాత్‌ బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో Virat Kohli Hits The Bulls Eye To Run-Out Shahrukh | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి బుల్లెట్‌ త్రో.. గుజరాత్‌ బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published Sat, May 4 2024 10:45 PM | Last Updated on Sun, May 5 2024 11:16 AM

Virat Kohli Hits The Bulls Eye To Run-Out Shahrukh

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన పరిచాడు.

కళ్లు చెదిరే త్రోతో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ షారూఖ్‌ ఖాన్‌ను రనౌట్‌ చేశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో రాహుల్‌ తెవాటియా ఆఫ్‌సైడ్‌ డిఫెన్స్‌ ఆడాడు.

అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్‌ ఖాన్ క్విక్‌ సింగిల్‌ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్‌ ఇచ్చాడు. 

అయితే షారూఖ్‌ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్‌ బౌలర్‌ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. 

వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ రిఫర్‌ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్త‌ర‌పోయారు. 

కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement