#SRH: లీగ్ మ్యాచ్‌ల్లో అద‌ర‌గొట్టారు.. ప్లే ఆఫ్స్‌లో తుస్సుమ‌న్పించారు | Sakshi
Sakshi News home page

#SRH: లీగ్ మ్యాచ్‌ల్లో అద‌ర‌గొట్టారు.. ప్లే ఆఫ్స్‌లో తుస్సుమ‌న్పించారు

Published Sun, May 26 2024 8:41 PM

Travisheks misery against KKR continues as SRH opening duo kept quiet

ఐపీఎల్‌-2024 లీగ్ మ్యాచ్‌ల్లో అద‌ర‌గొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ కీల‌క‌మైన ప్లే ఆఫ్స్‌లో చేతులెత్తేశారు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా క్వాలిఫ‌య‌ర్‌-1, క్వాలిఫ‌య‌ర్‌-2లో నిరాశ‌ప‌రిచిన ఈ విధ్వంస‌క‌ర జోడీ.. ఇప్పుడు చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌స్సుమ‌న్పించారు.

ఫైనల్‌ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ‌ రెండు పరుగులు చేయగా.. ట్రావిస్‌ హెడ్‌ అయితే ఏకంగా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. కేకేఆర్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. అద్భుతమైన బంతితో అభిషేక్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మరోవైపు హెడ్‌ను వైభవ్‌ ఆరోరా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.

హెడ్‌ విషయానికి వస్తే.. ఆఖరి 4 మ్యాచ్‌ల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సార్లు హెడ్‌ డకౌటయ్యాడు.అదే విధంగా అభిషేక్‌ కూడా ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు వీరిద్దరిని ట్రోలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement