ధనాధన్‌ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది! Tiger Bhukha Hai Suryakumar Yadav Reacts to Sarfaraz Khan Blistering 50 | Sakshi
Sakshi News home page

Sarfaraz Khan: ధనాధన్‌ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!

Published Fri, Mar 8 2024 6:39 PM | Last Updated on Sat, Mar 9 2024 7:01 AM

Tiger Bhukha Hai Suryakumar Yadav Reacts to Sarfaraz Khan Blistering 50 - Sakshi

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ అదరగొట్టాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు.

కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మూడో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సర్ఫరాజ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది  కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్‌ ఖాన్‌పై మరో ముంబై బ్యాటర్‌, టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్‌ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది.

శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(103), శుబ్‌మన్‌ గిల్‌(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(65), సర్ఫరాజ్‌ ఖాన్‌(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్‌ తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement