టీ20 వరల్డ్‌కప్‌లో నేడు (జూన్‌ 17) మరో ఆసక్తికర సమరం | T20 World Cup 2024: NZ To Take On PNG And WI To Take On AFG On June 17th, More Details Inside | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌లో నేడు (జూన్‌ 17) మరో ఆసక్తికర సమరం

Published Mon, Jun 17 2024 2:37 PM

T20 World Cup 2024: NZ To Take On PNG And WI To Take On AFG On June 17th

పొట్టి ప్రపంచకప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 17) మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. సూపర్‌-8 బెర్త్‌లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్‌-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్‌ సెయింట్‌ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లు ఇదివరకే సూపర్‌-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

గ్రూప్‌-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్‌ కూడా జరుగనుంది. ట్రినిడాడ్‌ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌, పపువా న్యూ గినియా సూపర్‌-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్‌ కూడా నామమాత్రంగా సాగనుంది.

కాగా, ఇవాల్టి మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. సూపర్‌-8 గ్రూప్‌-1లో గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ (A1).. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ (C1).. గ్రూప్‌-డి నుంచి బంగ్లాదేశ్‌ (D2) జట్లు ఉన్నాయి.

సూపర్‌-8లో గ్రూప్‌-1 మ్యాచ్‌లు..

జూన్‌ 20- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా (బార్బడోస్‌)
జూన్‌ 20- ఆస్ట్రేలియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా (సెయింట్‌ విన్సెంట్‌)
జూన్‌ 24- ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 24- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (సెయింట్‌ విన్సెంట్‌)

సూపర్‌-8 గ్రూప్‌ 2లో గ్రూప్‌-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ (B2).. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌ (C2).. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. 

సూపర్‌-8లో గ్రూప్‌-2 మ్యాచ్‌లు..

జూన్‌ 19- యూఎస్‌ఏ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్‌ 19- ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- యూఎస్‌ఏ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)

గ్రూప్‌-1, గ్రూప్‌-2ల్లో అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 

 

 

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement