T20 World Cup 2024: పాపం న్యూజిలాండ్‌.. పదేళ్ల తర్వాత తొలిసారి..! For The First Time Since 2015, New Zealand Failed To Reach Semifinals Or Finals Of ODI Or T20 World Cup. Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: పాపం న్యూజిలాండ్‌.. పదేళ్ల తర్వాత తొలిసారి..!

Published Fri, Jun 14 2024 4:57 PM | Last Updated on Fri, Jun 14 2024 6:10 PM

T20 World Cup 2024: For The First Time Since 2015, New Zealand Failed To Reach Semifinals Or Finals Of ODI Or T20 World Cup

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో న్యూజిలాండ్‌ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో (వన్డే/టీ20) సెమీస్‌ లేదా ఫైనల్‌కు చేరకుండా నిష్క్రమించడం ఆ జట్టుకు పదేళ్లలో  ఇది తొలిసారి. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో చివరిసారి సెమీస్‌ లేదా ఫైనల్స్‌కు చేరకుండా (రౌండ్‌ 2) ప్రపంచకప్‌ టోర్నీల నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్‌.. 2015 నుంచి వరుసగా ఆరు సార్లు సెమీస్‌ లేదా ఫైనల్స్‌కు చేరుకుంటూ వచ్చింది.

2015 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు చేరిన న్యూజిలాండ్.. ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు, 2021 టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు, 2022 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు, 2023 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరింది.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌ చేతుల్లో అనూహ్య పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. 

ఈ టోర్నీ హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ అవమానకర రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ తరహాలోనే శ్రీలంక కూడా సూపర్‌-8కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు పాకిస్తాన్‌ ఈ రెండు జట్ల సరసన చేరేందుకు సిద్దంగా ఉంది.

టెస్ట్‌ ప్లేయింగ్‌ దేశాలైన న్యూజిలాండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ కనీసం సూపర్‌-8కు కూడా చేరకుండానే నిష్క్రమిస్తుండటంతో ఆయా దేశాలకు చెందిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, యూఎస్‌ఏ, స్కాట్లాండ్‌ లాంటి చిన్న జట్లు ఈ టోర్నీలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. 

పై పేర్కొన్న జట్లలో అనుభవ పరంగా అన్నింటి కంటే చిన్న జట్టైన యూఎస్‌ఏ ఓసారి ప్రపంచ ఛాంపియన్‌ అయిన పాక్‌కు షాకిచ్చిప పెను సంచనలం సృష్టించింది. నేడు (జూన్‌ 14) ఐర్లాండ్‌తో యూఎస్‌ఏ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిచినా లేక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దైనా యూఎస్‌ఏ సూపర్‌-8కు, పాక్‌ ఇంటికి చేరతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement