T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు..! | Afghanistan Set 116 Runs Target For Bangladesh In Super 8 Match | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు..!

Published Tue, Jun 25 2024 8:31 AM | Last Updated on Tue, Jun 25 2024 10:57 AM

T20 World Cup 2024: Afghanistan Set 116 Runs Target For Bangladesh In Super 8 Match

టీ20 వరల్డ్‌కప్‌ 2024 సూపర్‌-8లో ఒక్క మ్యాచ్‌ గెలవకపోయిన సెమీస్‌కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్‌కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 24) జరుగుతున్న మ్యాచ్‌లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌ (43) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

ఇబ్రహీం జద్రాన్‌ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్‌ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. రిషద్‌ హొసేన్‌ (4-0-26-3), తస్కిన్‌ అహ్మద్‌ (4-1-12-1), ముస్తాఫిజుర్‌ (4-0-17-1), షకీబ్‌ (4-0-19-0) ఆఫ్ఘన్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ అనంతరం వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను ఆపేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement