PAK Vs IRE: ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. పరువు కోసం పాక్‌! తుది జట్లు ఇవే | T20 WC 2024: Pakistan Win Toss And Opt To Bowl Against Ireland, See Details Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. పరువు కోసం పాక్‌! తుది జట్లు ఇవే

Published Sun, Jun 16 2024 7:54 PM

T20 WC: Pakistan win toss, opt to bowl against Ireland

టీ20 వరల్డ్‌కప్‌-2024 నుంచి ఇప్పటికే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌.. చివరగా తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్‌తో పాకిస్తాన్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

తమ ఆఖరి పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పాక్‌ జట్టులోకి నసీం షా స్ధానంలో అబ్బాస్‌ అఫ్రిది రాగా...ఐరీష్‌ జట్టులోకి బెన్‌ వైట్‌ వచ్చాడు. 

ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. ఐర్లాండ్‌ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలుపొందలేదు.

తుది జట్లు
ఐర్లాండ్‌: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్

Advertisement
 
Advertisement
 
Advertisement