టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌కు గాయం | Shardul Thakur Faces Injury Scare In Practice Session | Sakshi
Sakshi News home page

IND vs SA 2nd Test: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌కు గాయం

Published Sun, Dec 31 2023 6:17 AM | Last Updated on Sun, Dec 31 2023 6:51 AM

Shardul Thakur Faces Injury Scare In Practice Session - Sakshi

సెంచూరియన్‌: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్‌ టెస్టు ఆడిన శార్దుల్‌ ఠాకూర్‌ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్‌ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్‌ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్‌ భుజానికి స్కానింగ్‌ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది.  

సఫారీ బౌలర్‌ కొయెట్జీ అవుట్‌
దక్షిణాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్‌ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్‌ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్‌ కెపె్టన్‌ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్‌గిడి, ముల్డర్‌లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement