పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజం..? | Shane Watson Has Been Approached By PCB For Head Coach Position | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజం..?

Published Sun, Mar 10 2024 2:51 PM | Last Updated on Sun, Mar 10 2024 3:12 PM

Shane Watson Has Been Approached By PCB For The Head Coach Position Of Pakistan Team - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్‌ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్‌ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్‌ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్‌ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ పెషావర్‌ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్‌ ఉంది. పాక్‌ హెచ్‌ కోచ్‌ పదవికి వాట్సన్‌ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.

కాగా, పాకిస్తాన్‌ టీమ్‌ డైరెక్టర్‌గా మొహమ్మద్‌ హఫీజ్‌ తొలగించబడినప్పటి నుంచి పాక్‌ జట్టు కోచ్‌ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్‌ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పీఎస్‌ఎల్‌ సీజన్‌ నడుస్తుంది. ఈ లీగ్‌ చివరి దశకు చేరింది. లీగ్‌ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జల్మీ నాకౌట్‌ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్‌ ఖలందర్స్‌ లీగ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement