Sean Whitehead Took All 10 Wickets in an Innings of a First Class Match - Sakshi
Sakshi News home page

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్‌

Published Sun, Nov 21 2021 11:07 AM | Last Updated on Sun, Nov 21 2021 12:30 PM

Sean Whitehead Took All 10 Wickets In An Innings Of First Class Match - Sakshi

Sean Whitehead Took All 10 Wickets Innings First Class Match.. సౌతాఫ్రికా ఫస్ట్‌క్లాస్‌ టోర్నమెంట్‌లో అద్భుతం చోటుచేసుకుంది. సాతాఫ్రికాకు చెందిన ఫస్ట్‌క్లాస్‌ లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ సీన్‌ వైట్‌హెడ్‌ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఫోర్‌ డే ఫ్రాంచైజీ 2021-22  సిరీస్‌లో భాగంగా సౌత్‌ వెస్ట్రన్‌ డిస్ట్రిక్స్‌, ఈస్ట్రన్‌ స్ట్రోమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీన్‌ వైట్‌హెడ్‌ మ్యాజికల్‌ స్పెల్‌ నమోదు చేశాడు. ఇంకో విశేషమేమిటంటే తొలి ఇన్నింగ్స్‌లోనూ సీన్‌ 5 వికెట్లు తీశాడు.

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రన్‌ స్ట్రోమ్స్‌  సీన్‌ దెబ్బకు 65 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సీన్‌ వైట్‌హెడ్‌ 12 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఈ పది వికెట్లలో..  రెండు స్టంప్స్ రూపంలో.. మూడు ఎల్బీ రూపంలో.. నాలుగు క్యాచ్‌ల రూపంలో.. మరొకటి కాట్‌ అండ్‌ బౌల్డ్‌ వికెట్‌ ఉంది. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 15 వికెట్లు తీసి మ్యాచ్‌ను శాసించిన సీన్‌ సౌత్‌ వెస్ట్రన్‌ డిస్ట్రిక్ట్స్‌కు 120 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. కాగా సౌతాఫ్రికా డమొస్టిక్‌ క్రికెట్‌ హిస్టరీలో సీన్‌ వైట్‌హెడ్‌ది రెండో ఉత్తమ ప్రదర్శనగా నమోదైంది. 1906లో లెగ్‌స్పిన్నర్‌ బెర్ట్‌ వాగ్లర్‌ ఒక ఇన్నింగ్స్‌లో 26 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. తాజాగా 115 ఏళ్ల తర్వాత సీన్‌ వైట్‌హెడ్‌ 10 వికెట్ల ఉత్తమ ప్రదర్శనతో మెరవడం విశేషం.

చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్‌- న్యూజిలాండ్‌ సిరీస్‌ 'మీనింగ్‌లెస్‌'

Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్‌ స్మిత్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement