శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం: ఆదిమూలపు సురేష్‌ | Ex-Minister Adimulapu Suresh Comments On Chandrababu White Paper | Sakshi
Sakshi News home page

శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం: ఆదిమూలపు సురేష్‌

Published Wed, Jul 3 2024 6:22 PM | Last Updated on Wed, Jul 3 2024 7:59 PM

Ex-Minister Adimulapu Suresh Comments On Chandrababu White Paper

సాక్షి, తాడేపల్లి: అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. పచ్చ పత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాం. రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాం. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు చేపట్టాం.’’ అని ఆదిమూలపు చెప్పారు.

అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదు?
‘‘తనది విజన్‌ అని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు ప్రశ్నించారు. ‘‘సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి. అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి.’’ అని ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు.

అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?
‘‘ వైఎస్‌ జగన్‌ పాలనపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్ అభివృద్ధి వంటివన్నీ ముందుకు తీసుకెళ్లాం. చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం. అసలు అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?. చేసిన అప్పులు ఎన్నో కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో చెప్తే బాగుండేది. సంపద సృష్టిస్తానని పదేపదే చంద్రబాబు ఆ సంపద ఎవరి కోసం సృష్టిస్తారో చెప్పాలి. తన వారికే సంపద సృష్టిస్తారా? ప్రజలందరికీ చేస్తారా?. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీలకు కూడా జగనే పెన్షన్ పెంచారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం’’ అని ఆదిమూలపు పేర్కొన్నారు.

వేలాది ఎకరాలు చేతులు మారాయి..
‘‘రాజధాని కడతానన్న చంద్రబాబు కనీసం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఎందుకు ఇవ్వలేదు?. రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగింది. 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్యలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఇది ఎలా జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. రాజధానిలో ఇవ్వాల్టి పరిస్థితికి టీడీపీదే బాధ్యత. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు?. ఆ రోడ్ మీద వెలుగుతున్న లైట్లు కూడా మా హయాంలో వేసినవే. దాన్ని కూడా తామే వేసినట్టు చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదం. రాజధానిలో 14 వందల ఎకరాలను 52 వేల మందికి పట్టాలు ఇచ్చాం. దానిపై చంద్రబాబు తన శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు?’’ అంటూ ఆదిమూలపు ప్రశ్నించారు.

దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?
‘‘అమరావతిలో 17 అంగన్ వాడీ సెంటర్లు, 14 స్కూళ్ల నిర్మాణం చేశాం. చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చేయలేదు, నిర్మాణాలు పూర్తి చేసి చూపించాం. అమరావతి మీదుగా వేసిన వెస్ట్‌ బైపాస్ నిర్మాణం మా హయాంలోనే చేశాం. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?. చంద్రబాబు ఐకానిక్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌లో చూపిస్తే.. జగన్ వాస్తవరూపంలో నిర్మించి చూపారు. రూ.841 కోట్లు రైతులకు కౌలు కింద అందించాం. కూలీలకు పెన్షన్ కింద రూ.580 కోట్లు అందించాం. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కేంద్రం నుండి మట్టి, నీళ్లు తప్ప ఏం సాధించారు?. ఇప్పుడైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి. ప్రజలకు చేస్తామన్న సంక్షేమ మేలును పూర్తి చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా ఇవ్వాలి’’ అని ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు.

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement