Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్‌ Rohit Sharma 37th Birthday Celebrations With Wife Ritika Ahead LSG vs MI | Sakshi
Sakshi News home page

Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. ఎంఐ వీడియో వైరల్‌

Published Tue, Apr 30 2024 1:04 PM | Last Updated on Tue, Apr 30 2024 4:51 PM

Rohit Sharma 37th Birthday Celebrations With Wife Ritika Ahead LSG vs MI

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్‌ 30). హిట్‌మ్యాన్‌ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, గౌతం గంభీర్‌, వసీం జాఫర్‌ తదితరులు రోహిత్‌ శర్మకు విషెస్‌ తెలిపారు. ఇక హిట్‌మ్యాన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌ అతడి బర్త్‌డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది.

మా జట్టు గుండె చప్పుడు
‘‘భారత క్రికెట్‌లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు హ్యాపీ బర్త్‌డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.

బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్‌మ్యాన్‌.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.

సోదర సమానుడు
‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్‌’’ అంటూ గంభీర్‌ విష్‌ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్‌ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్‌ తెలిపాడు.

కాగా ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 

 ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్‌ యాదవ్‌, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.

 

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement